న్యూఢిల్లీ : ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో ఐడిఎఫ్‌సి లిమిటెడ్ విలీనం అయ్యింది. ఇందుకు రెండు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడిఎఫ్‌సి వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు షేర్లు పొందనున్నారు. మౌలిక వసతుల రంగానికి మద్దతును అందించడానికి 1997లో ఐడిఎఫ్‌సిని ఏర్పాటు చేయగా.. ఆ సంస్థ తన అనుబంధంగా 2014 ఐడిఎఫ్‌సి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. కాగా.. మాతృసంస్థనే తాను నెలకొల్పిన సబ్సీడరీలో విలీనం కావడం విశేషం. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌కు 2023 మార్చి నాటికి 809 శాఖలు, 925 ఎటిఎంలు ఉన్నాయి.










