
అమరావతి : సిపిఐ(యం) సీనియర్ నాయకులు, కేంద్రకమిటీ పూర్వ నాయకులు బాసుదేవ్ ఆచార్యకు నివాళి కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఐ(యం) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ నాయకులుగా దేశానికి విశేష సేవలందిచారని, రైల్వే కార్మికులను ఆర్గనైజ్ చేయడంలో విశేషకృషి చేశారని తెలిపారు. రైల్వే ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణను వ్యతిరేకించారు. కోల్ వర్కర్స్‌ని ఆర్గనైజ్ చేశారు. బెంగాల్‌లో ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ధ్కెర్యంగా పోరాడారని పేర్కొన్నారు. పార్టీ మీద భౌతికంగా, సిద్ధాంతపరంగా జరుగుతున్న దాడులను తిప్పికొట్టడంలో ముందువరుసలో ఉన్నారని చెప్పారు. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 9 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా సాధారణ కార్యకర్తగా, నిరాడంబరంగా జీవించారని తెలిపారు. లక్ష్యసాధన కోసం చివరిదాకా నిలబడ్డారని తెలిపారు. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరావు మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు జె.జయరాం అధ్యక్షతన జరిగిన ఈ నివాళి కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటి సభ్యులు ఆండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గన్నారు. సంతాప సూచికంగా మౌనం పాటించారు.