ప్రజాశక్తి - పూసపాటిరేగ (విజయనగరం) : మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని మండల విద్యాశాఖాధికారులు ఎ.రాజ్ కుమార్, బి.పాపినాయుడు అన్నారు. మంగళవారం స్థానిక ఎస్.వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో మండలస్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను ఎంఈఓలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల సమగ్రాభివఅద్ధికి విద్యతోపాటు క్రీడలు ముఖ్యమేనని తెలిపారు. విద్యార్థులందరూ గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో ఆడాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలిగాలని చెప్పారు. క్రీడలలో రాణించి ఉన్నతస్థాయిలో ఉన్న క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. మొదటి రోజు కోకో, వాలీబాల్, టెన్నకాయిట్, త్రో బాల్ అంశాలలో జరిగిన క్రీడా పోటీలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలకు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గా పి.లీలాకఅష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శంకరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.










