Sep 15,2023 17:49

ప్రజశక్తి - చీరాల :చీరాల మండలం తోటవారిపాలెం బైపాస్‌ జంక్షన్లో పిట్టువారిపాలెం కు చెందిన పి మోహన్‌ రావు(65) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా టాటా ఏసీ డీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.