ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదల్లో చిక్కుకుని బయటిికి రాలేక అరుస్తోంది.
'మ్యావ్, మ్యావ్' అన్న అరుపు విని ఒకతను దాన్ని చిక్కులోంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నించాడు.
కానీ పిల్లికి అది అర్థంకాక, మనిషి దగ్గరకు రాగానే చేతి మీద గాయం చేసింది.
ఇంకో అతను ఇది చూసి 'పోనీలే అలాగే వదిలేయి. అది జంతువు. దానికే ఎలా బయటపడాలో తెలుస్తుంది' అన్నాడు.
కానీ అతను వదిలేయలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, పిల్లిని ఆ చిక్కులోంచి రక్షించాడు.
'అవును పిల్లి జంతువే. దాని నైజం తన జోలికి వచ్చిన వారిని గీరటం, గాయం చేయడం. కానీ నేను మనిషిని జాలి, దయ, కరుణ చూపడం!' అని అన్నాడతడు.
- ఎన్. అవంతిక
5వ తరగతి, జివిఎంసి స్కూల్,
పిఠాపురం కాలనీ సెంటర్.