చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : చేతివృత్తుల సంఘం
ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : ఈ నెల 5న కార్మికుల సమస్యల పరిష్కారానికై సిఐటియు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో తలపెట్టిన తలపెట్టిన 'చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కార్మికులంతా విజయవంతం చేయాలని చేతి వఅత్తుల సంఘం మండల కన్వీనర్ టి శ్రీను ఆదివారం పిలుపునిచ్చారు. స్థానిక బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో జరిగిన కార్యక్రమంలో చేతివఅత్తుల సంఘం మండల కన్వీనర్ టి.శ్రీను మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సంపదను విదేశీ స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందన్నారు. దీనివలన నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. మోడీ పాలనలో అన్ని ధరలూ ఆకాశాన్నంటాయన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశనకర విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, భవన నిర్మాణ రంగం నాయకులు ఎన్.రామకృష్ణ, ఎన్.అచ్చారావు, వీరబాబు, శివరాజబాబు, ప్రసాద్, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.










