Oct 02,2023 11:24

పోరు బందరులో పుట్టారు
చక్కని విద్యను నేర్చారు
తల్లి మాటలు విన్నారు
వ్యసనాలకు దూరంగా ఉన్నారు

బారిష్టర్‌ చదివారు
దక్షిణాఫ్రికా వెళ్లారు
జాతి వివక్ష చవి చూశారు
పోరు బాటనే పట్టారు

భారతదేశం వచ్చారు
సబర్మతి ఆశ్రమం నిర్మించారు
చంపరాన్‌ సత్యాగ్రహం చేశారు
నీలిమందు రైతులకు తోడు నిలిచారు

బ్రిటిష్‌ దమన నీతిని నిరసించారు
ఉప్పు పన్ను వ్యతిరేకించారు
దండి సత్యాగ్రహం చేశారు
జాతిని ఏకతాటిపై నడిపారు

అహింస మార్గములో నడిచారు
సహాయ నిరాకరణకు పిలుపునిచ్చారు
స్వదేశీ ఉద్యమం చేపట్టారు
కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చారు

క్విట్‌ ఇండియా నాదం చేశారు
బ్రిటిష్‌ పాలకులను వణికించారు
జైలు జీవితం గడిపారు
నిరాడంబరతకు అద్దంగా నిలిచారు

భరతమాత దాస్య సంకెళ్లు తెంచారు
భారతీయులకు స్వేచ్ఛ వాయువులను తెచ్చారు
జాతిపితగా నిలిచారు
ఎవరో అది ఎవరో
మీ అందరికీ తెలుసు కదా
మహాత్ముడిగా నిలిచిన గాంధీ కథ!

- మొర్రి గోపి
88978 82202