Nov 11,2023 12:41

పారిస్  :   గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తోన్న దాడులను వెంటనే ఆపాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ పిలుపునిచ్చారు. గాజాలో పౌరులపై దాడి ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై బాంబులతో హత్య చేయడాన్ని ఖండించారు. మనవి ప్రజాస్వామ్య దేశాలని,  ఉగ్రవాద చర్యలను ఫ్రాన్స్‌ ఏ మాత్రం సహించదని,   గాజాలో బాంబుదాడులను ఆపాలని తాము  కోరుతున్నామని అన్నారు. మాక్రాన్  పిలుపుపై ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. పాలస్తీనా భూభాగాన్ని తిరిగి ఆక్రమించుకోవాలన్న ప్రణాళికతో దాడులు చేయడం లేదని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు నెతన్యాహూ పేర్కొన్నారు.