ప్రజాశక్తి -ప్రకాశం : నెల్లూరు- చిత్తూరు జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు బుధవారం రీపోలింగ్ జరుగుతున్నాయి. తిరుపతి నగరంలో రీ పోల్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల వరకు 229 పోలింగ్ కేంద్రంలో 14.34 శాతం, 233 పోలింగ్ కేంద్రంలో 12.75 శాతం నమోదైంది. రీ పోలింగ్ మొత్తం శాతం 13.54 గా ఉందని డిఐపిఆర్‌ఓ తెలిపారు.










