Aug 08,2023 15:13

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు. నగరానికి చెందిన సామల రితీష్‌కు అమెరికాలోని నార్త్‌ వెస్ట్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ సీటు లభించింది.చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించే రితీష్‌ తండ్రి అమెరికాకు తన కొడుకుని పంపించే స్తోమత లేక ఇబ్బందుల పాలయ్యారు. ఈ విషయాన్ని రితీష్‌ ఎమ్మెల్సీ కవితకి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత రితీష్‌ అమెరికాకు వెళ్లడానికి అవసరమయ్యే ఖర్చులను భరించారు. వారికి టికెట్స్‌ సొంత ఖర్చులతో ఇప్పించారు. తన కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక చేయూత అందించి అండగా నిలబడిన ఎమ్మెల్సీ కవితకు రితీష్‌ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.