ప్రజాశక్తి నందలూరు: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, నందలూరు జూనియర్ సివిల్ జడ్జ్ కె.లత పేర్కొన్నారు. ఈనెల 9న జరగబోవు జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి శుక్రవారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీ కోర్టు వద్ద నుంచి బస్టాండ్ కూడలి కొనసాగింది.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కక్షిదారులు రాజీమార్గంలో తమ సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది, పి ఎల్ వి, కక్షిదారు లు పాల్గొన్నారు.










