Aug 31,2023 15:39

బాపట్ల : భారత విద్యార్థి ఫెడరేషన్‌( ఎస్‌ఎఫ్‌ఐ) బాలికల టీం ఆధ్వర్యంలో రాఖీ పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ రాఖీ అంటే అన్నా చెల్లెళ్ళ అనుబందానికి ప్రతీక అని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేద్దాం ఆడపిల్లలను కాపాడుకుందాం అనే నినాదంతో రాఖీ పండుగ జరుపుతున్నాం అని అన్నారు. సమాజంలో ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యలకు కారణం మద్యం, మత్తు పదార్ధాలే అని వాటిని నివారించడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది అని పటిష్ఠమైన చాట్టాలతో మద్యం నిషేధానికి కఅషి చేయాలని ఆడపిల్లలను కాపాడుకోవాలని కోరారు, ఈ సందర్భంగా నిజాంపట్నం మండలం ఎంపీపీ హరినాథ్‌ బాబు గారికి, వివిధ ప్రముఖులకు కళాశాలల ఉపాధ్యాయులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.