
నే స్తమా
నిన్నా మొన్నా ప్రపంచమంతా
నిండు మానవతా సంద్రమై ఉన్నప్పుడు
నువ్వూ నేనూ దోస్తులమే
మెరుస్తూ వెలుగులు పంచే శక్తులమే
నేడూ రేపూ ప్రస్తుతమంతా
మార్కెట్ ఎడారిగా మారిన వేళ
నువ్వూ నేనూ వస్తువులం
మానవులం.. ఇసుక రేణువులం
కాస్తా తలెత్తి చూస్తే తెలిసొస్తుంది
దుస్తులకే కాదు మన మస్తిష్కాలకూ
ధరల పట్టీలు వేలాడుతున్నాయి
ఇష్టాయిష్టాల సమస్త భావాలపై
సమూహ మైకపు ప్రభావాలున్నాయి
నిన్నూ నన్నూ వేరుగా చూపే, దూరం పెంచే
అగాధాలున్నాయి.. ఆధునిక వాదాలున్నాయి
సరేలే నేస్తం, వాస్తవాన్ని చూద్దాం
నిస్తేజం వదిలేద్దాం
ఎదురు గాలిని ఒడిసి పడితే
ఇసుక రేణువులే ఎగసిపడితే
బేహారి కళ్ళు మసకబారవా?
బజారు వ్యూహాలు బేజారు కావా?!
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931