Oct 14,2023 13:13

ఇజ్రాయెల్‌ : ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌ కీలక కమాండర్‌ ఒకరు మరణించినట్లు ఐడిఎఫ్‌ చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ పత్రిక వెల్లడించింది. అయితే దీన్ని హమాస్‌ ధ్రువీకరించలేదు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర పోరు నెలకొన్న నేపథ్యంలో ... నిన్న (శుక్రవారం) ఇజ్రాయెల్‌ బలగాలు గాజా భూభాగంలో ప్రవేశించాయి. గాజాలోని హమాస్‌ నెట్‌వర్క్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హమాస్‌ ఏరియల్‌ ఆపరేషన్లు నిర్వహించే విభాగం హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఈ ఘటనలో హమాస్‌ ఏరియల్‌ ఫోర్స్‌ హెడ్‌ అబు మురద్‌ మృతి చెందారని ఐడిఎఫ్‌ చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ పత్రిక కథనంలో వెల్లడించింది. శుక్రవారం రాత్రంతా హమాస్‌ కమాండో దళాలకు చెందిన పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ పదుల సంఖ్యలో వైమానిక దాడులు జరిపినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే, అతడి మృతిని హమాస్‌ ఇంకా ధ్రువీకరించలేదు.