
రామునిపల్లి అనే ఊరిలో రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడు. అతనికి చిన్నప్పటి నుండి కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. అయితే అతని తల్లిదండ్రులు మాత్రం బాగా చదువుకోవాలని, ఆటలు ఆడితే దెబ్బలు తగులుతాయని, రాహుల్‌ని ఆడనిచ్చేవారు కాదు.
ఒకరోజు రాహుల్ కబడ్డీ ఆడిన విషయం తల్లిదండ్రులకు తెలిసింది. బాగా తిట్టారు. చాలా సార్లు చెప్పినా వినకపోయే సరికి, నెమ్మదిగా వాళ్లు, రాహుల్‌ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆటపై అతనికున్న ఇష్టాన్ని గ్రహించి ప్రోత్సహించారు. ఆ రోజు నుంచి రాహుల్ బడిలో పాఠాలు బాగా చదువుతూనే కబడ్డీ ఆటపై దృష్టి పెట్టాడు.
ఓసారి స్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో కబడ్డీ ఆటకు రాహుల్ టీంకి ప్రథమ బహుమతి వచ్చింది. స్కూలు వాళ్లు బాగా ప్రోత్సహించి, మండల స్థాయిలో కూడా ఆడించారు. తరువాత ఆ టీం జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. అక్కడ కూడా రాహుల్ తన టీమ్‌ని గెలిపించాడు. కలెక్టర్ ద్వారా బహుమతి తీసుకున్నాడు. రాహుల్‌ని ఊరి వారందరూ మెచ్చుకున్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రాహుల్‌ని చూసి గర్వపడ్డారు. అప్పుడు కలెక్టరు మాట్లాడుతూ, 'పిల్లలను చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. తల్లిదండ్రులకు, ఊరికి, బడికి పేరు తీసుకొస్తారు'' అని చెప్పారు. ఆ మాటలకు సభలో చప్పట్లు మార్మోగాయి.
- కారంకంటి రాహుల్, 8వ తరగతి,
జక్కాపూర్, సిద్దిపేట జిల్లా, 99081 97910.