
అమరావతి : జర్నలిస్టుల ఇంటి స్థలాల జీవో నిబంధనలు సవరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. మంగళవారం రామకృష్ణ మాట్లాడుతూ ... జీవో 395 ప్రకారం 95 శాతం మంది పాత్రికేయులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఇంటి స్థలం ఖరీదులో 40 శాతం జర్నలిస్టు భరించాలనే నిబంధన ఎత్తివేసి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.