Sep 07,2023 14:54

ప్రజాశక్తి -కోట : రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రతి విద్యార్థి సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని కోట మండల విద్యాశాఖ అధికారి దారా.మస్తానయ్య అన్నారు. ఈ సందర్భంగా గురువారం కోట మండలంలోని మండల ప్రజా పరిషత్‌ కోట మెయిన్‌ పాఠశాలను ఆకస్మికంగా ఎంఈఓ ధారా మస్తానయ్య తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జగనన్న గోరుముద్ద పథకానికి, విద్యార్థుల పలు రికార్డులను తనిఖీ చేశారు. అదేవిధంగా జగనన్న గోరుముద్ద కార్యక్రమం, పలు రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నందుకు ప్రధానోపాధ్యాయురాయులైన ప్రమీలా ను ఎంఈఓ అభినందించారు.