Aug 29,2023 14:56

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో ప్రకృతి ప్రసాదించిన ఇసుక ఇటు ప్రజలకు దక్కకుండా అటు ప్రభుత్వానికి దక్కకుండా జగన్‌ జేబులోకి వెళుతోందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్యే నిమ్మల ఆధ్వర్యంలో పెనుగొండ మండలం, సిద్ధాంతం జాతీయ రహదారి పక్కన అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక ర్యాంపు వద్దమంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ.. 4 సంవత్సరాల్లో జగన్‌ ఇసుకపై రూ 40 వేల కోట్లు మింగినట్లు చెప్పారు. అసలు జెపి అనే దివాళా సంస్థను ఎరగా చూపి జగన్‌ ఇసుకను దోచేస్తున్నారన్నారు. గోదావరి పక్కన కొండలు వలె ఇసుక గుట్టలు నిల్వలున్నాయని.. కనీసం ఇక్కడ పోలీస్‌, రెవిన్యూ, మైనింగ్‌ అధికారులు ఎవరు ఉండరని చెప్పారు. ఇసుక అక్రమ మైనింగ్‌ అపకపోతే పెద్ద ఎత్తున్న ఆందోళననలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తణుకు మాజీ ఎమ్మెల్యే రాధకృష్ణ తదితరులు పాల్గొన్నారు.