Jul 18,2023 16:10

ప్రజాశక్తి-వాకాడు: సమగ్ర రీ సర్వేపై తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డీ.కే. బాలాజీ వాకాడు మండల తహశీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. తహశీల్దార్‌ నరసింహారావు వీఆర్వోలు విలేజ్‌ సర్వేయర్లతో మాట్లాడి.. మండలంలో జగనన్న భూ రక్షలో భాగమైన సమగ్ర రీ సర్వే ఎంతవరకు పూర్తయింది ఇంకా ఎన్ని గ్రామాలు పెండింగ్లో ఉన్నది తెలుసుకున్నారు. దాంతోపాటు వీఆర్వోలు సర్వేయర్‌లతో సహకరించుకుంటూ గ్రామాలలో జరిగే రీసర్వే విషయంలో పొరపాట్లు జరగకుండా కచ్చితత్వం పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సెల్వరాజ్‌ వీఆర్వోలు సర్వేయర్లు పాల్గొన్నారు.