శరీరంలో అయోడిన్ కొరత ఏర్పడితే పలు 'అయోడిన్ లోప రుగ్మతలు' కలుగుతాయి. అయోడిన్‌తో కూడిన ఆహార పదార్థాలను నిరంతరం సక్రమంగా తీసు కోవాలి. అప్పుడు ఈ రుగ్మతలు నివారించబడి సంపూర్ణ ఆరోగ్యం సమ కూరుతుంది. ఈ అవగాహన కల్పించ డానికి ప్రతి ఏటా 21 అక్టోబర్ రోజున ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినం పాటిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే వివరాల ప్రకారం ప్రపంచ జనాభాలో 1/3 వంతు మంది ప్రజలు అయోడిన్ లోపంతో బాధ పడుతున్నారని తేలింది. ఇండియాలో 20 కోట్ల మంది అయోడిన్ లోప రుగ్మతల ప్రమాదంలో ఉన్నారని, 7.1 కోట్ల మంది గాయిటర్ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని తేలింది. 1984లో భారత ప్రభుత్వం అయొడైజ్డ్ సాల్ట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ, 1993లో నాన్-అయొడైజ్డ్ ఉప్పు వాడకాన్ని నిషేధించింది.
వ్యాధి చికిత్స కన్న నివారణే మిన్న అని, అయోడిన్ లోపం రాకుండా ముందే జాగ్రత్త పడాలని విశ్వ మానవాళికి అవగతం చేయడం మన కనీస బాధ్యత. అయోడిన్ ప్రాముఖ్యతను వివరించడం, అయోడిన్ లోప రుగ్మతల లక్షణాల అవగాహన, అయోడిన్ సహిత ఆహారాన్ని తీసుకోవడం, అయోడిన్ లోపానికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయడం...లాంటి అంశాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి. అయోడిన్ లోప రుగ్మతలు నివారించ దగినవని, అయోడిన్ సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
- డా|| బుర్ర మధుసూదన్ రెడ్డి,
సెల్ : 9949700037