ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : పుస్తక పఠనంతో మేధాశక్తి పెరుగుతుందని కలకడ గ్రంథాలయ శాఖ అధికారి అమరనాథ తెలిపారు .బుధవారం మండల కేంద్రమైన కలకడ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు పుస్తక పట్టణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్థానిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి వారి చేత చదివించడం జరిగిందని తెలిపారు. విద్యార్థి దశలో పుస్తకాలు, దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరిలో మేధాశక్తితో పాటు ఉల్లాసంగా ఉండేందుకు, తెలివితేటలు పెంచుకునేందుకు దోహదపడేందుకు అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.