ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా స్ధానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరహారదీక్ష శిబిరంలో శుక్రవారం టిడిపి నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు దేవు వెంకటరాజు సగం గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ... చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపారన్నారు. ఈ దీక్షకు పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, టిడిపి నాయకులు గుండు వీర తాతరాజు, తదితరులు సంఘీభావం తెలిపారు.










