Feb 02,2023 15:34

రాంబిల్లి : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎనిమిది గ్రామాల నేవీ నిర్వాసితులు చేస్తున్న నిరసన దీక్షలు గురువారానికి 95 రోజులకు చేరాయి. ఈ దీక్షల్లో నర్సాపురం, కొత్తపట్నం, వాడ రాంబిల్లి, గోవింద పాలెం, కేజీ పాలెం, 8 గ్రామాలకు చెందిన నిర్వాసితులు పాల్గొన్నారు. ఇప్పటికైనా మా సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిష్కరించాలన్నారు. లేదంటే రేపటి నుంచి ఉద్యమం మరింత ఉధఅతం చేస్తామంటూ 8 గ్రామాల నిర్వాసితులు హెచ్చరికలు జారీ చేశారు.