Apr 18,2023 14:49

ప్రజాశక్తి-వి.ఆర్‌.పురం(అల్లూరి) : కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారభేరి మంగళవారం ఉమ్మడివరం గ్రామాలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి హామీ పనులను సందర్శించి, వారిసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండలు ఎక్కువ అవటంతో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని ప్రచార బేరి బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు చేస్తున్న వారికి మజ్జిగ, మంచినీళ్లు, మెడికల్‌ కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ, మతోన్మాద విధానాలను వ్యతిరేకించాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్య బట్టారు. పోలవరం ముంపు భాదితులను ప్యాకేజీ ఇవ్వకుండా ప్రజలను అంకెల గారడీ చేస్తుందన్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటికరణ చేస్తూ, ఓడరేవు, విమానాశ్రాయాలు, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌, భూములను అడవులను బడా బాబులైన అదాని, అంబానీలకు కట్టాబెడుతుందని ఆగ్రహం వ్యక్తం. చేశారు. తక్షణమే గిరిజన చట్టం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం నిర్వసితులకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పంకు సత్తిబాబు, జి.లక్ష్మణరావు, హజరత్‌, చిక్కాల.రామారావు తదితరులు పాల్గొన్నారు.