
విజయవాడ: ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయములో సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు. అనంతరం సాయంత్రం 07 గంటలకు ప్రధాన, ఉప ఆలయముల కవాటబంధనం చేయనున్నారు. తిరిగి రేపు(సోమవారం) యధావిధిగా అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ఇంద్రకీలాద్రిలోని దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. కనకదుర్గమ్మ దర్శనార్థం ఆలయమునకు మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వెంకటరమణ విచ్చేశారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటాన్ని అధికారులు, వేదపండితులు అందజేశారు.