లండన్ : బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో భారత సంతతి రచయిత్రి చేతనా మారూ తొలి నవల 'వెస్ట్రన్ లేన్' నిలిచారు. బ్రిటీష్ గుజరాతీల నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. స్క్వాష్ క్రీడను మానవ భావోద్వేగాలకు ప్రతీకగా చూపుతూ కథనం సాగడం జడ్జిల ప్యానెల్‌ను ఆకట్టుకుంది. షార్ట్ లిస్ట్‌కు ఎంపికైన జాబితాను ప్యానెల్ అధ్యక్షులు, కెనడా రచయిత ఈసి ఎడ్యుగాన్ ప్రకటించారు. ఆరు నవలలు షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో ప్రచురించిబడిన మొత్తం 163 నవలలను ముందుగా లాంగ్ లిస్ట్‌కు ఎంపిక చేశారు. ఇందులో నుంచి ఆరు నవలలను ఈ షార్ట్ లిస్ట్‌కు ఎంపిక చేశారు. ఈ షార్ట్ లిస్ట్‌కు ఎంపికైన రచయితలకు కూడా 2,500 పౌండ్లను బహుమతిగా ఇస్తారు.