Feb 07,2023 16:32

ప్రజాశక్తి- పిచ్చాటూరు (తిరుపతి) : మండలంలోని కైలాసకోనలోని కైలాసనాథ స్వామి మహాశివరాత్రి వేడుకల వాల్‌ పొస్టర్‌ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున కైలాసనాథ కోణంలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కైలాస కోనలో జలపాతానికి సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు నుంచి ఎక్కువమంది వస్తారని కావున ఆలయ చైర్మన్‌, పోలీస్‌ అధికారులు భద్రత కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కైలాసకోన చైర్మన్‌ మునస్వామి యాదవ్‌, కార్యనిర్వహణ అధికారి కృష్ణా నాయక్‌, ఎంపీపీ దివాకర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ శంకర్‌, సింగిల్‌ విండో అధ్యక్షులు ఊరప్ప తదితరులు పాల్గొన్నారు.