
గుడ్డులో మంచి పోషక విలువలు, ప్రోటీన్స్ ఉంటాయి. ఇంట్లో పిల్లలు, పెద్దలు వీటిని తింటుంటారు. దీంతో ఎక్కువమొత్తంలో కొనుగోలు చేస్తుంటాం. అయితే సరైన పద్ధతిలో వాటిని నిల్వ చేసుకోకపోతే త్వరగా పాడైపోతాయి. అలా పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.
- సాల్మెనెల్లా బ్యాక్టీరియా గుడ్ల షెల్, లోపల ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెరుగుదల గది ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉంటుంది. ఫ్రిజ్లో పెడితే బ్యాక్టీరియా గుడ్డుపైనే కాకుండా మిగతా పదార్థాలపై కూడా వ్యాపిస్తుంది.. అందుకే వీటిని ఎట్టి పరిస్థితులలో ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
- కోడి గుడ్డు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే వాటిని ఎక్కువగా కదపడకూడదు. వెడల్పుగా ఉండే భాగాన్ని పైకి వచ్చేలా వెడల్పు తక్కువ ఉండే భాగాన్ని కిందికి వచ్చేలా ఉంచాలి.
- అలాగే గుడ్ల పైన పెంకుపై కొద్దిగా నూనె రాసి పెడితే, కనీసం 10 నుండి 12 రోజుల వరకూ తాజాగా ఉంటాయి.
- టిష్యూ పేపర్లలో చుట్టి నిల్వ చేసుకున్నా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.