Mar 01,2023 20:10

న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్‌ కాస్ట్‌ బేస్‌డ్‌ లెండింగ్‌ రేటు (ఎంసిఎల్‌ఆర్‌)ను 10 బేసిస్‌ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక నెల ఎంసిఎల్‌ఆర్‌ 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక సంవత్సరం ఎంసిఎల్‌ఆర్‌ను 8.75 శాతానికి చేర్చింది. కొత్త వడ్డీ రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఆ బ్యాంక్‌ తెలిపింది.