Aug 26,2023 21:43

తమిళనాడులోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం(చెపాక్‌)ను ఐసిసి ప్రతినిధులు పరిశీలించారు. ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 8న భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ఈ మైదానంలోనే జరగనుంది. ఐసిసి హెడ్‌ క్యూరేటర్‌ ఆండీ ఆట్కిన్సన్‌ చెపాక్‌ స్టేడియం యొక్క అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు. ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ పళని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 'ఇది పెద్ద టోర్నమెంట్‌కు ముందు నిర్వహించబడే సాధారణ తనిఖీ. అన్ని సౌకర్యాలు సవ్యంగా ఉన్నాయో లేవో.. ఐసిసి ప్రతినిధులు పరిశీలించారు. స్టేడియంలో ఉన్న సౌకర్యాలను చూసి ప్రతినిధులు సంతోషించారు. మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించిన ప్రతి ఒక్కటి స్టేడియంలో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు' అని తెలిపారు.