
తరువేరా జీవితానికి
వెలుగునిచ్చే వెన్నెలా
తరువేరా బతుకు బాటకు
తోవ చూపే తల్లిరా
నీడనిచ్చి గాలినిచ్చే
ప్రాణవాయువూ..
కాలుష్యం బారినుండి
మనల్ని కాపాడేది వృక్షమేరా
పూలనిచ్చి కాయనిచ్చి
పలు రకాల పండ్లనిచ్చి
అందరి ఆరోగ్యం కోసం
పాటు పడును చెట్టుయేరా
జంతువులకు పక్షులకు
అడవితల్లి బిడ్డలకు
జగతిలోని జీవరాశులకు
ఆశ్రయమిచ్చేది తరువేరా
కలప కొరకు డబ్బు కొరకు
చెట్టు నరకబోకురా
ఒక చెట్టును నరికితేను
పది చెట్లను పెంచరా
- ద్వారపురెడ్డి జయరాం నాయుడు