ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మానవతా సంస్థ విలువలే ప్రాతిపదికగా ఏర్పడిందని పట్టణ సబ్ ఇనిస్పెక్ట్టర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం ఫ్యూచర్ మైండ్స్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ ,జూనియర్ కలాశాల విద్యార్థులతో కలిసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజంపేట పట్టణంలో శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీ ఆర్ అండ్ బి బంగ్లా నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఏ.యన్.ఆర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విడిదిలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కె.రాముడు, టి.రమణా రెడ్డి, యస్.అబ్దుల్లా, కె.సురేష్, వై.నంద కిషోర్, యన్.శివరాజ్, బి.రామచంద్ర నాయుడు, బి.శ్రీనివాసులు నాయుడు, వేణు గోపాల్ నాయుడు, చంగయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిధులుగా కడప పట్టణ అధ్యక్షులు రమణా రెడ్డి, జిల్లా ఈ.సి సభ్యులు కె.దేవానంద్ లు పాల్గన్నారు. వారు మాట్లాడుతూ కులమతాలకు, రాజకీయాలకు, ప్రాంతాలకతీతంగా సాటి మానవునికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ అని తెలియజేశారు.










