అమరావతి : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం యూరప్‌కు వెళ్లారు. ఆ సర్జరీ విజయవంతమయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ యూరప్‌లోనే దాదాపు నెల రోజుల వరకు విశ్రాంతి తీసుకోబోతున్నారట. అక్టోబర్ ముగింపులో తిరిగి భారతదేశానికి రానున్నట్లు సమాచారం. మళ్లీ నవంబర్ మొదటి వారం నుంచి సినిమా షూటింగుల్లో పాల్గొంటారట.
వైద్యుల సలహా మేరకు నెలరోజులపాటు విశ్రాంతి...
బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో ప్రభాస్‌కు మోకాకి నొప్పి సమస్య వచ్చింది. ఆ తరువాత తాత్కాలిక చికిత్స తీసుకొని షూటింగ్స్ చేశారు. ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్‌లన్నీ మోకాలి నొప్పితోనే పూర్తి చేశారు. అయితే మోకాలి నొప్పి మరింత తీవ్రతరం కావడంతో సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకొని యూరప్‌కు ప్రయాణమయ్యారు. వాస్తవంగా ... ప్రభాస్ నటించిన సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం వాయిదా పడింది. ఈ విషయం ప్రభాస్‌కి ముందే తెలియడంతో ప్రాజెక్ట్ కే (కల్కీ 2898 ఏడీ), మారుతి సినిమాల షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లారు. యూరప్‌లో మోకాలి శస్త్ర చికిత్స పూర్తి చేసుకొని 15 రోజుల్లో తిరిగి రావాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారట. అయితే వైద్యుల సలహా మేరకు దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోబోతున్నారట.










