Oct 14,2023 11:11

గాజా: ఇజ్రాయెల్‌ దాడితో ధ్వంసమైన గాజాలో తాగునీరు, కరెంటు లేకుండా గర్భిణులతో సహా ప్రజలు సంక్షోభంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి సంస్థ పేర్కొంది. ఆహారం, నీరు, విద్యుత్‌ ఇతర అవసరమైన సామాగ్రి లేకుండా పోతున్నాయని ఐరాస ప్రతినిధి స్టెఫాన్‌ డుజారిక్‌ చెప్పారు. ప్రస్తుతం 50,000 మంది గర్భిణులకు అవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. వీరిలో 5,500 మంది మహిళలు ప్రసవానికి దగ్గరగా ఉన్నారు. ఎమర్జెన్సీ షెల్టర్లలో కూడా నీటి సమస్య తీవ్రమవుతోంది.గాజాలోని ఆసుపత్రులు కూలిపోయే దశలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆసుపత్రులకు కొన్ని గంటలపాటు మాత్రమే కరెంటు వస్తుంది. ఇది అవసరమైన చికిత్స కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. మతుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసిపో యాయి. మందులతో సహా అత్యవసర సామాగ్రి కొరత కూడా ఆసుపత్రుల బంద్‌కు దారి తీస్తుంది.గాజాలో 34 ఆరోగ్య కేంద్రాలపై దాడులు జరిగాయి. 11 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా మరణించారు. నీటి సరఫరా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. 423,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతం నుండి పారిపోయారు. %ఖచీ% నేతత్వంలోని 18 పాఠశాలలతో సహా 88 విద్యాసంస్థలు ధ్వంసమ య్యాయి. వాటిలో రెండు ఎమర్జెన్సీ షెల్టర్లు.ఐక్యరాజ్యసమితి నియమించిన హక్కుల నిపుణులు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్‌ ఆంక్షలు అన్యాయమని, ఉద్దేశపూర్వకంగా ఆకలితో చంపడం మానవాళికి వ్యతిరేకంగా నేరమని అన్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని హింసను సమర్థించడం లేదు. ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధించబడింది మరియు యుద్ధ నేరం అవుతుంది. ఉద్దేశపూర్వకంగా ఆకలితో చంపడం మానవత్వానికి వ్యతిరేకంగా నేరమని నిపుణులు అంటున్నారు.ఇజ్రాయెల్‌ పాలస్తీనియన్లను ఒక రోజులో గాజా విడిచిపెట్టమని బెదిరించింది. గురువారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ షెల్టర్‌లలో ఉన్నవారితో సహా ప్రజలను ఖాళీ చేయమని అల్టిమేటం జారీ చేసింది. దక్షిణాది ప్రాంతానికి తరలించాలని కోరారు. కానీ వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన వారితో సహా 10 లక్షల మందిని తరలించడం అసాధ్యమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. గాజాలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.యుద్ధం ప్రారంభమైన వారంలో, గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు 1,799 మంది పాలస్తీని యన్లను చంపాయి. 6,388 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో మరణించిన వారి సంఖ్య 1,300కి చేరుకుంది 3,000 మందికి పైగా గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని వివిధ ప్రాంతాలలో ఇజ్రాయెల్‌ షెల్లింగ్‌లో తొమ్మిది మంది మరణించారు. ఇజ్రాయెల్‌ 3.5 మిలియన్ల సైనికులు, ట్యాంకులు, ఇతర ఆయుధాలను గాజా సరిహద్దులో మోహరించింది.