కడప ప్రతినిధి : ఆరోగ్యశ్రీ సేవలతోనే రోగులకు స్వస్థత సాధ్యం. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే ఆరోగ్య శ్రీ కో- ఆర్డినేటర్, 104 కాల్‌సెంటర్, హెల్ఫ్‌డెస్క్, ఆరోగ్య మిత్రలను సంప్రదింస్తే పరిష్కారం లభిస్తుంది. రేషన్‌కార్డులు లేకపోవడం, కార్డు ల్లో పేర్లు నమోదు చేయకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొనే రోగులకు సిఎంసి లెటర్ ద్వారా ఆరోగ్యశ్రీ సేవలకు అర్హత కల్పిస్తాం. రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీ విభాగంలోనికి మరిన్ని అదనపు వ్యాధులను చేర్చిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని పేర్నొంటున్న ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ డాక్టర్,వి.బాలాంజనేయులతో ప్రజాశక్తి ముఖాముఖి...
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఎన్ని?
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో 43 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 12 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో మూడు హాస్పిటల్స్‌కు ఇటీవలే అనుమతి లభించింది. ఈలెక్కన 52 హెల్ప్‌డెస్క్‌ల్లో ఆరోగ్యమిత్రలు సేవలు అందిస్తున్నారు.
నెట్‌వర్క్ ఆస్పత్రులు వివరాలు చెప్పండి?
కడప నగరంలో 17, ప్రొద్దుటూరులో 10, జమ్మలమడుగులో 03, పులివెందుల్లో 05, కమలాపురంలో 01, మైదుకూరులో 02, బద్వేల్‌లో 02, రాజంపేటలో 02, రైల్వేకోడూరులో 01, రాయచోటిలో 02 హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీసేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల సంఖ్య ఎంత?
2019 నుంచి 2023 ఆగష్టు నాటికి 2,51,093 మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద పలువురు రోగులకు సేవలు అందించడ మైంది. రోజుకు 40 నుంచి 50 ఆపరేషన్ల లెక్కన నెలకు 1500 నుంచి 2000 ఆపరేషన్లు చేయిస్తున్నాం. ఈమేరకు రూ.538.33 కోట్లను చెల్లించడమైంది.
అత్యధిక సర్జరీ కేసులేమిటి?
రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 3,255 వ్యాధులకు చికిత్సలు అందిస్తోంది. ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా అత్యధికంగా ఆర్ధోపె డిక్, గైనకాలజీ, కార్డియాలజీ, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా చికిత్సలు చేయించుకుంటున్నారనేది ఓ అంచనా.
కార్డులు లేని, పేర్లు గల్లంతైన రోగుల పరిస్థితేమిటి?
రషన్‌కార్డులు లేని, పేర్లు గల్లంతైన పేద రోగులకు ఆరోగ్య శ్రీ పథకం వర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స తీసుకోవాలనుకుంటున్న రోగులకు సిఎంసి లెటర్‌ను అంది ంచి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు సిఫారసు చేస్తాం.
'ఆసరా' పథకం అమలు ఎలా ఉంది?
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోని సర్జరీ రోగులు కోలుకునే సమ యాన్ని లెక్కించి రోజుకు రూ. 225 చొప్పున రూ.ఐదు వేల ను 24 గంటల్లోపు సర్జరీ రోగుల ఖాతాల్లో వేయడం జరుగుతోంది. దీని ఆసరాతో రోగుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడంతోపాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
'ఆసరా' లబ్ధిదారుల సంఖ్య, వెచ్చించిన వ్యయమెంత?
ఆరోగ్యశ్రీ ఆసరా కింద 1519 వ్యాధులు ఎంపిక చేయడ మైంది.ఇందులో 1,8,667 మంది లబ్ధిదారులకు రూ.67.06 కోట్లు ఖర్చు చేశాం.
ఆరోగ్యశ్రీ రోగులు ఫిర్యాదు చేయాలనుకుంటే ఎలా?
ఆరోగ్యశ్రీసేవలు సక్రమంగా అందని పక్షంలో రోగులు హెల్ప్ డెస్క్, ఆరోగ్యమిత్ర, 104 కాల్‌సెంటర్లను ఆశ్రయించే సదుపాయం కల్పించాం.










