Sep 14,2023 17:20

ప్రజాశక్తి- గణపవరం:జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా గురువారం కొమ్మర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో హిందీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కటకం సుందర కుమార్‌ మాట్లాడుతూ 1949లో సెప్టెంబర్‌ 14న రాజ్యాంగ పరిషత్‌ లో హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించినట్లు చెప్పారు. అప్పటినుండి హిందీ దివస్‌ వేడుకలు నిర్వహించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జరిగిన హిందీ నఅత్య కళారూపాలు అందని ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులతో వ్యాసరచన, వకృత్వ, హిందీ ప్రాజెక్టులు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి సౌజన్య, ఎల్‌ ప్రసాదరావు, జి పార్వతి, సిహెచ్‌ లీలా గోపాల్‌, సరస్వతి, రమేష్‌, పేరెంట్స్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.