 
                      ప్రజాశక్తి - చీరాల (ప్రకాశం) : చీరాల పట్టణ ప్రజలకు చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ తరపున చీరాల పట్టణ అధ్యక్షుడు కోండ్రు బాబ్జి చీరాల పట్టణ ప్రజలకు ఆదివారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... చీరాల పట్టణం ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెలుగొందాలని, కష్టాలు తొలగిపోవాలని, మతాబులు, చిచ్చుబుడ్లువలె వారి జీవితాలు వెలగాలని అన్నారు. వెంకటేష్ బాబు త్వరగా కోలుకుని నియోజకవర్గ ప్రజల మధ్యకు వచ్చి పార్టీ కార్యక్రమాలలో ఉత్సహాంగా పాల్గొనాలని కోరారు. కరణం బలరామ కృష్ణమూర్తి, కరణం వెంకటేష్ ల సారథ్యంలో చీరాల నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
 
     
       
    




 
 
 
 
 
 





