ఉప్పరపల్లి (తిరుపతి) : ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లె సమీపంలో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు ఉప్పరపల్లెకు చెందిన మోహన్ గాంధీ కుమారుడు జాన్సన్ (23)గా గుర్తించారు. మత్తుకు బానిసై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మఅతుడి తండ్రి తెలిపారు. ఘటనపై తిరుపతి రూరల్ ఎస్సై ఎంపి నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










