Sep 13,2023 15:45

ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : జె ఎన్ టి యు విశ్వ విద్యాలయం లో మూడు రోజులు పాటు జరిగే హక్తాన్ 2కె 23 సదస్సు బుధవారం ప్రారంభమైంది..సెమినార్ ను వైస్ ఛాన్సలర్ వెంకట్ సుబ్బయ్య  ప్రారంచి మాట్లాడారు. నేడు కంప్యూటర్ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులను అంది పుచ్చుకోవడం ద్వారా దేశాభివృద్ధి లో భాగస్వామ్యం కాగలమన్నరు.ఇటువంటి జాతీయ సెమినార్లు నిర్వహించుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. సి ఎస్ ఈ డిపార్ట్మెంట్ విద్యార్దులు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇంచార్జీ రిజిష్టర్ రాజేశ్వరరావు పలువురు అధ్యాపకులు సాంకేతికత దాని ఉపయోగాలు గురుంచి వివరించారు. సీ ఎస్ ఈ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో అధ్యాపకులు,విద్యార్దులు పాల్గొన్నారు.