కనిపించే దేవుడు
లోకమందున గురువు
నడిపించు నాయకుడు
నీడనిచ్చే తరువు
విజ్ఞాన జ్యోతితో
అజ్ఞానము బాపును
ఎనలేని నీతితో
జీవితాలు దిద్దును
గురువంటే భానుడు
చీకటిని పోగొట్టు
సాటిలేని యోధుడు
గమ్యాన్ని చూపెట్టు
పూజనీయుడు గురువు
సత్యాన్ని బోధించు
భువిలో కల్పతరువు
చేతులను జోడించు
సమ సమాజ స్థాపకుడు
అందరి ప్రేమికుడు
విద్యను అందించే
విజ్ఞాన సంపన్నుడు
అక్షరాల వనిలో
తోటమాలి అతడు
బహు గౌరవనీయుడు
ఆరాధనపాత్రుడు
గురు దేవుల మేధలో
జ్ఞాననిధి ఉన్నది
వారి చేయు బోధలో
అమృతభాండమున్నది
గురు దేవులు లేనిచో
జగతి ప్రగతి శూన్యం
వారి ఆవశ్యకత
అవనిలో అనివార్యం
- గద్వాల సోమన్న, 9966414580.










