మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణకు చేరుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన కథానాయకురాలుగా నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి మరో కథానాయకురాలిగా చేస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియోలో ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, మరికొంతమంది నటులు పాల్గొంటున్నారని, ఈ క్లైమాక్స్ చిత్రీకరణ చాలా ఆసక్తికరంగా వుండబోతోంది అని సమాచారం.










