Oct 11,2023 07:40

మాతృ భూమే
మరు భూమి అయిపోయే,
స్వంత ఇల్లే
పరాయిదయిపోయే,
ఆక్రమణదారే
అసలు యజమాని అయిపోయే,
ఎదిరిస్తే
దాడి అని ముద్ర వేసే,
ఇదెక్కడి న్యాయం?
అయినా,
అంతర్జాతీయ పోలీస్‌ వారి పక్షమే
విశ్వగురు ఇక సరేసరి,
మారణహోమంతో అట్టుడుకుతున్న
మణిపూర్‌పై నోరెత్తం,
పాలస్తీనాను ఆక్రమిస్తున్న
ఇజ్రాయిల్‌ పక్షాన మాత్రం వెంటనే స్పందిస్తాం,
ప్రజాస్వామ్యం అని వల్లె వేస్తాం
దురాక్రమణకు సమర్ధిస్తాం,
అదే మా నీతి
అమెరికాకు గులాంగిరి.
 

- ఎ. అజ శర్మ