
స్వాత్ : పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. తాజాగా పాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగుల మహాకూటమి పిలుపు మేరకు శుక్రవారం స్వాత్‌లో భారీ ర్యాలీ జరిగింది. ములాబాబా పాఠశాల నుంచి స్వాత్ ప్రెస్ క్లబ్‌వరకు జరిగిన భారీ ర్యాలీలో నిరసనకారులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణల వల్ల తమ పెన్షన్‌లో 35 శాతం కోత విధించడం జరుగుతుందని, ఇది అన్యాయని, ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని నిరసనలు చేశారు.