
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం:ప్రజల నెత్తిన భారాలు మోపడనికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుంటాయని,పేదల సమస్యలు పరిష్కరంలో ఆమడ దూరంలో ఉంటాయని సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు తెలిపారు.అధిక ధరలు తగ్గించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని కేంద్ర సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు గురువారం స్థానిక యాగర్లపల్లి, రామచంద్రరావు పేటలలో సమరభేరి ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు హాజరయ్యారు.ఈ కార్యక్రమం ను ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు,కరెడ్ల రామకఅష్ణ లు మాట్లాడుతూ, మోడీ తొమ్మిదేళ్ల పాలనలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని, నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోడీ ప్రభుత్వ సూచనలతో విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై విపరీతమైన విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని వారు విమర్శించారు.పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. మరోపక్క ఉపాధి లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలు ను అరికట్టాలని లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ప్రజలపై భారాలు వేసే ప్రభుత్వాలకు పాలించే అర్హత లేదని వారు అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వారు అన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన సచివాలయాల వద్ద జరిగే కార్యక్రమాన్ని,నాలుగొవ తేదీన మండల ఆఫీసుల వద్ద జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని పట్టణ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి జవ్వాది శ్రీను, పోతు శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, తంగేటి శ్రీను, పతివాడ నాగేంద్రబాబు, యడవల్లి వెంకన్న, కొమ్మిరెడ్డి ఉదరు,తోట శ్రీను గొర్లి సత్తిబాబు, షేక్ సాయిబన్ తదితరులు పాల్గొన్నారు.