Apr 27,2023 11:58

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రతిష్ట దేశమంతా తెలిసేలా అమ్మ జాతరను వైభవంగా నిర్వహిద్దామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపునిచ్చారు. గంగ జాతర సందర్భంగా 7 పాటలతో రూపొందించిన గంగ జాతర స్వర కుంభాభిషేకం సిడిని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గురువారం ఆవిష్కరించారు. భీమాస్‌ రెసిడెన్సీ హౌటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్ట మొదటి గ్రామ దేవత దేవాలయం మన తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయమని, తిరుపతి గంగమ్మ ఆలయం నుంచే జాన పద పండుగ భావస్పూర్తి దేశానికి వ్యాపించిందన్నారు. రాయలసీమకే తిరుపతి గంగ జాతర తలమానికమని వివరిస్తూ గంగమ్మ తల్లి ఆలయ ప్రాశస్థ్యం భారత జాతికి తెలియాలన్నారు. గంగమ్మ దర్శనం తర్వాతే తిరుమల శ్రీవారిని దర్శించుకునే విధానం గతంలో ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యమ్రకంలో తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ హరిత ఐఏఎస్‌, డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ, గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ కట్టా గోపీ యాదవ్‌, ఈవో మునికృష్ణ, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్‌ రెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, హనుమంత నాయక్‌, రుద్రరాజు శ్రీధేవి, దేవానంధ్‌, రాజేంధ్ర, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.