Sep 30,2023 12:22

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలో స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్తి జయంతి వేడుకలు ముందస్తుగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు ఉపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ, చిట్టూరి వెంకట శ్రీధర్‌, శేషారత్నంలు విద్యార్థులతో కలిసి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి వేషధారణలో విద్యార్థులు అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించే విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.