Jul 07,2023 21:23

గుర్‌గావ్‌ : ప్రముఖ మొబైల్‌ తయారీదారు సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త గెలాక్సీ ఎం34 5జిని విడుదల చేసింది. 6.6 అంగులాల సూపర్‌ అల్మోడ్‌ డిస్‌ప్లే, ఒఐఎస్‌తో 50 ఎంపి ట్రిపుల్‌ రేర్‌ కెమెరా, 6000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 25వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ మద్దతుతో దీన్ని ఆవిష్కరించింది. 6జిబి ర్యామ్‌. 128 జిబి స్టోరేజీ ధరను రూ.16,999గా, 8జిబి, 128 జిబి ధరను రూ.18,999గా నిర్ణయించింది. జులై 15 నుంచి ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో లభ్యమవుతుందని తెలిపింది.