గుర్‌గావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ తమ గెలాక్సీ బుక్3 సిరీస్ ఉత్పత్తుల కోసం ప్రీ బుకింగ్స్‌ను తెరిచినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. గెలాక్సీ బుక్3 అల్ట్రా, గెలాక్సీ బుక్3 ప్రో 360, గెలాక్సీ బుక్3 ప్రోలను ఇటీవల ఆ సంస్థ ఆవిష్కరించింది. వీటి కోసం దేశంలోని ప్రముఖ అన్‌లైన్ స్టోర్‌లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. వీటిపై గరిష్టంగా రూ.16వేల వరకు బెనిఫిట్స్‌ను పొందవచ్చని తెలిపింది.










