Nov 02,2023 09:36

న్యూఢిల్లీ : ప్రజలు, కంపెనీల నుంచి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో పన్ను వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో వస్తు సేవల పన్నులు (జిఎస్‌టి) రికార్డ్‌ స్థాయిలో రూ.1.72 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. దీంతో జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత రెండో సారి అత్యధిక వసూళ్లు చోటు చేసుకున్నట్లయ్యింది. ఇంతక్రితం 2023 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల రాబడి చోటు చేసుకుంది. గతేడాది అక్టోబర్‌లోని రూ.1.66 లక్షల కోట్లతో పోలిస్తే క్రితం నెల వసూళ్లలో 13 శాతం వృద్థి చోటు చేసుకుంది. సిజిఎస్‌టి రూపంలో 30,062 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.38,171 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.91,315 కోట్లు, సెస్‌ రూపేనా రూ.12,456 కోట్లు చొప్పన పన్నులు వసూళ్లయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన నెలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 11 శాతం వృద్థితో 8,127 కోట్ల జిఎస్‌టి వసూళ్లయ్యింది. తెలంగాణలో 19 శాతం పెరిగి రూ.11,377 కోట్లుగా నమోదయ్యాయి.