
విజయవాడలోని జాషువా సాంస్క ృతిక వేదిక, గురజాడ జయంతి నుంచి జాషువా జయంతి (సెప్టెంబరు 21 నుంచి 28) వరకు ప్రతిరోజు వైవిధ్యభరితంగా సాంస్క ృతిక విందు ఏర్పాటు చేసింది. గేయం, చిత్రం, నృత్యం, సినిమా, లఘు చిత్రం, సందేశం నాటకం... ఇలా పలు సజనాత్మక ప్రక్రియల్లో పసందుగా వీక్షకులను ఆకట్టుకొంది. గురజాడ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 21వ తేదీన దేశ భక్తి గీతాగానంలో 2 వేల మంది పైగా పాల్గొన్న కార్యక్రమం ఏర్పాటు చేయగా, 22న యలవర్తి నాయుడమ్మ జయంతి సందర్భంగా బాలోత్సవ్ భవన్‌లో పర్యావరణంపై చిన్నారులు గీసిన చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 23, 24 తేదీల్లో నేపథ్య గాయకుడు బాలు వర్ధంతి సందర్భంగా లఘు చిత్రాల ప్రదర్శన, 25న చక్రపాణి వర్ధంతి సందర్భంగా యువతరం పేరిట 'భగత్ సింగ్ బాటలో' విద్యార్థులచే జానపద పాశ్చాత్య నత్యాల ప్రదర్శన; 26 నుంచి 28 వరకు 'యువ తరంగం' పేరిట యువనాటికల పోటీలను నిర్వహించారు.
ఎంబి విజ్ఞాన కేంద్రం చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల కళాశాల / విశ్వవిద్యాలయ స్థాయి నాటికల పోటీని సుమధుర కళానికేతన్, సిద్ధార్థ కళాపీఠం, జాషువా సాంస్క ృతిక వేదిక, ఆంధ్ర నాటక కళాసమితి సంయుక్త నిర్వహణలో 'యువ తరంగం' శీర్షికన నాటిక పోటీలు జరిపారు. నాటకం ఒక చైతన్య గీతిక, నాటకం ఒక జీవన సరళి, నాటకం ఒక ప్రశ్నించే తత్వం, నాటకం భాషకు భావం, నాటకం ఒక నవీన రూపిక అన్న స్పృహతో యువతను నాటక రంగం వైపు ఆకర్షించే ఒక చక్కటి చిక్కటి గట్టి ప్రయత్నమే ఇది.
చదలవాడ నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభింపబడిన ఈ నాటికల పోటీల ప్రారంభ సభలో నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య మాట్లాడుతూ, 'యువత సెల్ఫోన్లో టిక్‌టాక్ లాంటివి చూస్తూ సృజనాత్మక కళల పట్ల ఆసక్తి, అభ్యసనం చేయటం లేదనడానికి నిదర్శనమే తాము ఆశించిన స్థాయి, సంఖ్యలో ఎంట్రీలు రాకపోవడం అని అన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం ఇది ప్రథమ ప్రయత్నమని, ఇది మున్ముందు కూడా కొనసాగుతుందని అన్నారు. ఆంధ్ర నాటక కళాసమితి నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంతకుముందు నిర్వహించిన బాలోత్సవ్‌కు వచ్చిన, వస్తున్న స్పందన చూసి అలాంటి కదలికనే యువ నాటక రంగంలో కూడా తీసుకురావాలన్నదే తమ ఈ ప్రయత్నమని అన్నారు. మరో వక్త చెన్నుపాటి వజీర్ మాట్లాడుతూ, సమాజంలోని రుగ్మతల మీద ప్రతిభావంతంగా ప్రభావాత్మకంగా చైతన్యం తీసుకురాగల ప్రక్రియ నాటక రంగం అని భావించే నాలుగు సంస్థలు ఒక వేదికగా నిర్వహించే పోటీలు ఇవి' అని అన్నారు. చివరగా రచయిత, దర్శకుడు, నటుడు వైఎస్ కృష్ణేశ్వర రావు మంచి ఆలోచనాత్మక ప్రసంగం చేశారు.
అనంతరం పోటీల్లో మొదటిరోజు - మొదటి నాటికగా 'ఇంకానా'ను విజయవాడ ఎస్‌డిఎంఎస్ మహిళా కళాశాల విద్యార్థినులు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ నాటిక రచన ఎన్‌ఎస్ నారాయణ బాబు, దర్శకత్వం వాసు. ఆనాటి నుండి ఈనాటి వరకు మహిళలపై, యువతులపై, బాలికలపై అత్యాచారం, హింస, దౌర్జన్యం, పెత్తందారీతనం, దోపిడీ.. ఇంకా కొనసాగాలా? అంటూ ప్రశ్నిస్తూ ఆలోచనలకు గురిచేస్తూ సాగింది. సాంకేతికంగా, ప్రయోగాత్మకంగా ప్రదర్శించి ప్రేక్షకుల మన్నన పొందారు. రెండవ నాటిక 'దంత వేదాంతం'ను డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం విద్యార్థులు ప్రదర్శించారు. భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ఒకప్పటి గ్రేట్ కామెడీ హిట్ నాటికను ప్రదర్శించారు. డాక్టర్ నేమాని శారద దర్శకత్వంలో ఈ నాటికను పూర్తి హాస్య నాటికగా ప్రదర్శించడంలో దర్శక, నటుల అవగాహనలోపం కనిపించినా కొంతవరకు ప్రేక్షకులను నవ్వించింది. పైపై మాటలు చెప్పే వ్యక్తులు నిజంగా తమకే అట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దానిని ఎదుర్కోవడానికి ఎంతగా భయపడిపోతారో, తనదాకా వస్తే మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో వ్యంగ్య ధోరణిలో చెప్పే ప్రయత్నం చేసింది. ఆనాటి చివరి ప్రదర్శన సింగపంగ ప్రభాకర్ రచన, దర్శకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు 'ఊసరవెల్లి' నాటికను సాంకేతికపరమైన అంశాల లోపాల వల్ల పూర్తిస్థాయి ప్రదర్శనగా ఇవ్వలేకపోయారు. నేటి ఆధునిక జీవితంలో మనిషి ఎలా ఊసరవెల్లిగా మారిపోయి స్వార్థపూరితంగా సొంత లాభమే ధ్యేయంగా ఆదిమానవుడి కన్నా ఘోరంగా, క్రూరంగా జీవిస్తున్నాడో ఈ నాటిక వివరించింది.
రెండవ రోజు సభా కార్యక్రమంలో సుమధుర కళానికేతన్ అధ్యక్షులు సామంతపూడి నరసరాజు, ఎంబీవికే కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, వాసవ్య మహిళా సంఘం సమితి జి.రష్మీ, జాషువా సాంస్క ృతిక వేదిక తరపున పరుచూరి అజయ్ మాట్లాడారు. మురళీకృష్ణ మాట్లాడుతూ, 'స్వాతంత్ర పోరాట కాలంలో, తెలంగాణ విమోచన ఉద్యమంలో నాటక రంగం నిర్వహించిన పాత్రను గుర్తు చేశారు. స్వతంత్ర భారతంలో కూడా అనేక దుస్సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, అనేక రకాల సమస్యలతో తల్లడిల్లుతున్న వర్తమాన నేపథ్యంలో.. యువతరం ఆయా అంశాలపై దృష్టి పెట్టాలని నొక్కి చెప్పారు. రష్మీ మాట్లాడుతూ, తమ మహిళా సంఘం యువతీ యువకుల సమూహాల్లో వారి తక్షణ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ, కళల ద్వారా సామాజిక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పరుచూరి అజరు మాట్లాడుతూ, ఇఫ్టాకు అనుబంధంగా ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన కర్నాటి లక్ష్మీ నరసయ్య గారి సేవలను ్గఉర్తు చేశారు. వారి సేవలను గుర్తించి డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారు ఒక కోర్సును ప్రారంభించి నిర్వహించటం అభినందనీయమని అన్నారు.
తదుపరి, రెండవ రోజు మొదటి నాటికగా 'ఇంతింతై' నవచైతన్య నాటక సమితి విశాఖపట్నం వారు ప్రదర్శించారు. డాక్టర్ మీగడ శశిభూషణ స్వామి రచన దర్శకత్వంలో కాలుష్యం పర్యావరణ ప్రదూషణ, ప్లాస్టిక్ పెను ప్రమాదం వంటి అంశాలపై ఆలోచింపచేసే ప్రయత్నం చేశారు. మరిన్ని రిహార్సల్స్‌తో దీన్ని మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరం కనిపించింది. ఆ తర్వాత 'అసుర వేదం' నాటికను జాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్ వారు ప్రదర్శించారు. ఇది బహుశా వేణుగోపాల్ మూల కథకు పనసాల నాటకీకరణ, దర్శకత్వం డాక్టర్ మల్లేష్ బల్లాష్ట్. ఒక గిరిజన బాలిక ముచ్చటపడి రక్షించి తెచ్చుకున్న జింకపిల్ల, చివరికి అటవీ శాఖ ఉన్నతాధికారి విందుకు వినియోగింపబడటం విషాదకర ముగింపు. నాటికలో అధిక భాగం శీర్షికకు న్యాయం కల్పించడం కోసం తీసుకున్న రావణాసుర ఉదంతం సింహభాగం ఆక్రమించి ఆశించిన లక్ష్యం సాధించటంలో వెనుకబడింది. చివరి నిమిషంలో ఏర్పడిన చిక్కుల వల్ల, సమాజం వారే పేర్కొన్నట్లు .. ఇందులో పెద్దవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పోటీ నిబంధన ఉల్లంఘించినట్లయింది.
పోటీలో చివరి రోజు జరిగిన సభలో డాక్టర్ గుమ్మా సాంబశివరావు, జాషువా 128వ జయంతి సందర్భంగా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. అనంతరం న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ విజయవాడ వారు ఎంఎస్ చౌదరి రచన, దర్శకత్వంలో 'కపిరాజు' నాటికను ఆద్యంతం ఆసక్తికరంగా, పూర్తి రంగస్థల క్రాఫ్ట్‌తో ప్రదర్శించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. కళాశాల స్థాయికి మించి, మొత్తం తెలుగు నాటక రంగమే గర్వించదగిన స్థాయిలో, యువకులలోని ప్రతిభావంతమైన రంగస్థల విలువలను వెలికి తీసి ప్రదర్శించిన నాటిక ఇది. వాలి- సుగ్రీవుల మధ్య అపార్థం, రావణాసుర అహంకార భంగం, వాలి వధకు శ్రీరాముడు ఇచ్చిన సమాధానంతో వాలి తనువు చాలించడం.. ఈ మధ్యలో మాయావి రగిలించిన చిచ్చు వల్ల సంభవించినట్లు చెబుతున్న సన్నివేశాలతో కథనం ఆసక్తికరంగా సాగింది. పోటీల్లో చివరి ప్రదర్శన దండు నాగేశ్వరరావు రంగస్థలానువాదానికి పివి రమణమూర్తి దర్శకత్వం వహించగా, నవరసా ధియేటర్ ఆర్ట్స్ వారు.. సైబర్ క్రైమ్స్ నేపథ్యంగా రూపొందించిన నాటిక 'ముళ్లతీగలు'. వైట్ కాలర్ గాళ్ల మోసాల ముళ్ళ తీగలకు చిక్కుకొని ఆర్థికంగా నష్టపోవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్న హెచ్చరికగా ఈ ప్రదర్శన జరిగింది. ఆనాటి కార్యక్రమంలో 'శకుంతలోపాఖ్యానం' బాలల నాటికను డాన్ బాస్కో స్కూలు మంగళగిరి, ఎర్రబాలెం విద్యార్థులు.. నాటికగా ప్రదర్శనకు కావలసిన సామాగ్రిని తామే స్వయంగా సమకూర్చుకొని ఆకర్షణీయంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలకు, కరతాళ ధ్వనులకు అందుకున్నారు.
ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా కపిరాజు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ముళ్ళ తీగలు నిఇచాయి. ప్రత్యేక జ్యూరీ బహుమతిని ఇంకానా నాటిక అందుకొంది. మరికొన్ని వ్యక్తిగత బహుమతులను గుణ నిర్ణేతలు- శాంతారావు, కృష్ణారావు, హెచ్‌విఆర్‌ఎస్ ప్రసాద్ ప్రకటించారు. యువతరంగం యువ నాటికల పోటీల నిర్వహణలో భాగం పంచుకున్న నాలుగు సంస్థలు, శకుంతలపాఖ్యానం బాలల నాటిక ప్రదర్శన బాధ్యులు నన్నపనేని నాగేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా బహుమతీ ప్రదానం జరిగింది. పోటీ నిర్వహణలో తెర వెనక గుండు నారాయణరావు, నరేన్ (జాషువా సాంస్క ృతిక వేదిక) జీవి రంగారెడ్డి (ప్రజా నాట్యమండలి, ఈ పోటీల మాధ్యమాల సమన్వయకర్త) అవిశ్రాంతంగా కషి చేసి మొత్తం కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడంలో తోడ్పడ్డారు.
ఈ వారం రోజుల కార్యక్రమాలకు వచ్చిన స్పందనతో నిర్వహణా బాధ్యులందరూ, మరిన్ని కార్యక్రమాలను సమీప భవిష్యత్తులో కూడా నిర్వహించడానికి కావలసిన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని పొందారు. బాలలకు, యువతకు కార్యశాలలు నిర్వహించి మరింత పెద్ద సంఖ్యలో యువతను సృజనాత్మక కళలవైపు మరల్చి, ప్రోత్సహించాలన్న దఢ సంకల్పం ఈ పోటీలు.. వారి లక్ష్యసాధన దిశగా ముందుకు నడిపాయని చెప్పవచ్చు.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655